ఆషాఢంలోనే బోనాలు ఎందుకు జరుపుతారు? వీటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి?
bonalu | విరబోసుకున్న జుట్టు , నిప్పుకణికల్లాంటి ఎర్రని కండ్లు, బయటకు చాచిన పొడవాటి నాలుకతో.. ఉగ్రరూపంలోని మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో ‘మైసమ్మ’ అని పిలుస్తారు. ఆ తల్లికి ఎన్నో పేర్లు. ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు. కోటనే మహంకాళిగా భావిస్తే ఆమెను ‘కోట మైసమ్మ’. దొరల గడిని మహంకాళిగా తలిస్తే ఆమె ‘గడి మైసమ్మ’
Bonalu | విరబోసుకున్న జుట్టు , నిప్పుకణికల్లాంటి ఎర్రని కండ్లు, బయటకు చాచిన పొడవాటి నాలుకతో.. ఉగ్రరూపంలోని మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో ‘మైసమ్మ’ అని పిలుస్తారు. ఆ తల్లికి ఎన్నో పేర్లు. ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు. కోటనే మహంకాళిగా భావిస్తే ఆమెను ‘కోట మైసమ్మ’. దొరల గడిని మహంకాళిగా తలిస్తే ఆమె ‘గడి మైసమ్మ’. కట్టకు పడిన గండిని మహంకాళిగా భావిస్తే ఆమె ‘గండి మైసమ్మ’. చెరువు (రూపంలో)ను మహంకాళిగా భావిస్తే ఆమె ‘కట్ట మైసమ్మ’. జంట నగరాల్లో, తెలంగాణ గ్రామాల్లో మహంకాళి గుళ్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి విశేషంలో ప్రకృతే ఉంది. ప్రకృతే దైవమనే సందేశమే ఉంది. ఊరు అనే పర్యావరణమే గ్రామదేవత!
ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ‘దేవత కళ్లెర్ర జేసింది’ అనే అనుకుంటాడు మనిషి. శరీర ధర్మంలో మార్పువల్ల వేడి చేసినట్టే, మహమ్మారి ప్రబలడం వల్ల ప్రకృతికి వేడి చేసిందని భావిస్తాడు. ఈ ఉష్ణమే ఉగ్రం. అందుకే ప్రకృతి వైపరీత్యాల పేర్లు అమ్మవారి నామాలుగా జనబాహుళ్యంలో స్థిరపడ్డాయి. ఆ మార్పులు పెద్ద ఎత్తున సంభవిస్తే అది మహమ్మారి (మహా + మారి) అవుతుంది. ఆ మహమ్మారిని అమ్మదేవతగా భావిస్తే మారెమ్మ (మహమ్మారి + అమ్మ) అవుతుంది. ఇలా జీవితాన్ని కబళించే ప్రకృతి ఉగ్రరూపాలకు పేర్లు ఇవ్వడమే కాదు.. రూపం కూడా ఇచ్చి గుడి కట్టుకున్నాడు మనిషి. భక్తుల రోగాన్ని అమ్మవారిగా భావించట్లేదు. దేవతగా భావించే ప్రకృతి ఆగ్రహాన్ని అమ్మవారి ఆగ్రహంగా భావిస్తున్నాడు. అదీ తేడా! మైసమ్మకు నల్ల పోచమ్మ, తెల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ తోబుట్టువులని జానపదుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడుగురు అక్కచెల్లెళ్లదీ ఉగ్రరూపమే. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఉగ్రత్వం ప్రదర్శిస్తారు. ఒంటిమీద నల్లని పొలుసులు (పోచలు) సృష్టించే మహమ్మారిని నల్ల పోచమ్మ అంటారు. తెల్లని పొలుసులు (పోచలు) వస్తే అది తెల్ల పోచమ్మ. దేహంపై (బొబ్బల మాదిరిగా) కురుపులు ఏర్పడితే అది ముత్యాలమ్మ. రోగగ్రస్తమైన తర్వాత శరీరం బక్కచిక్కి డొక్కలు తేలేట్టు అయితే.. డొక్కలమ్మ.
సల్లంగ జూడాలె
ఉగ్రం(వేడి)గా ఉన్న ప్రకృతి దేవతను చల్లబరిచేందుకు (సల్లంగ చూడమని కోరేందుకు) జరిపేదే బోనాల సమర్పణ. కరువుకాటకాలు, వరదలు, అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా ఆ ప్రకృతి దేవత ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బోనమెత్తినట్టే .. కరువుకాటకాలు, అంటురోగాలు ప్రబలకుండా చూడమని ప్రతి ఆషాఢంలో ఊరూ వాడా బోనాల జాతరై కదులుతుంది. వేడిగా ఉన్న శరీరాన్ని చల్లబరచడానికి చలువ చేసే ఆహారం తీసుకున్నట్లే.. ఉగ్రం (ఉష్ణం)గా ఉన్న అమ్మవారిని (ప్రకృతి దేవతని) చల్లబరిచేందుకు సమర్పించే బోనంలో కూడా చలువ చేసే ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి సాకపోసే కల్లు, ఉల్లిగడ్డ, చింతపండు రసం, రతి (బోనాలు సమర్పించగా అమ్మవారి వద్ద కుప్పగా) పోసిన అన్నంపై చల్లిన వేడి నెత్తురు.. అన్నీ చలువ చేసేవే. వీటిని సమర్పిస్తే అమ్మవారు (ప్రకృతి) శాంతిస్తుందని భక్తుల నమ్మకం. కరువు, వరదల నుంచి కాపాడి, అంటురోగాల బారినపడకుండా కాపాడమంటూ ప్రకృతిని శాంతింపజేసే (చల్లబరిచే) ఊరుమ్మడి కార్యక్రమం బోనాల పండుగ.
తొలకరి పండుగ
ఆషాఢం వానల కాలం. పల్లె పర్యావరణంలో తొలకరి చినుకులు ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. నేల పదునుగా ఉంటుంది. రైతు దుక్కి దున్నుతాడు. బంగారు పంటలు పండాలని కోరుకుంటాడు. అతని కలలు మొలకెత్తే నేల, అవి ఫలించే మొక్క ప్రకృతే. తన కలలు పండాలని, పంట పండాలని రైతు ప్రకృతి దేవతను ఆరాధిస్తాడు. తొలకరి వానకు తొలిసాలు దున్నడంతో సేద్యం పని మొదలవుతుంది. రైతు తీసుకునే ఆ నిర్ణయం.. అన్ని కులాలవారి ఇండ్లలో సంతోషాలు తెస్తుంది. వడ్రంగి వ్యవసాయ సామగ్రిని మెరుగు పరుస్తాడు. కమ్మరి లోహ పనిముట్లు సిద్ధం చేస్తాడు. పంట పండితేనే కూలీలకు చేతినిండా పని. వాళ్లకు చెరువే ఆదరవు. ఆ చెరువు నీళ్లతో పొంగిపొర్లుతుంటే.. ముత్రాసి వాళ్ల చేపల వేటకు ఉపాధి. ఊరి మురికినంతా వదిలించే చాకలికి, కుండలు చేసే కుమ్మరికి కూడా చెరువు నీళ్లే ఆధారం. అందుకే చెరువును నింపి సల్లంగ చూడమని ప్రకృతిని కోరేందుకు ఊరంతా కదిలివస్తుంది. కాబట్టే, బోనాల జాతర ఊరి నిర్మాణాన్ని బట్టి జరుగుతుంది. ఊళ్లో ఎన్ని కులాలు ఉంటే, అన్ని కులాల వారి భాగస్వామ్యంతో నిర్వహిస్తారు.
పనిబాటలోళ్ల సంబురం
తెలంగాణ బోనాలు మొదలయ్యే గోల్కొండ కోటలో బోనం మున్నూరుకాపు కులానికి చెందిన పటేలమ్మ ఇంటినుంచి వస్తుంది. అమ్మవారి జాతరలో బైండ్లవాళ్లు డప్పులు కొడుతూ వస్తారు. చాకలి బలి ఇస్తారు. లష్కర్ బోనాల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఇమ్మడిశెట్టి వారి ఇంటి దగ్గర రతి పోసి, గావు పడతారు. ఊరి కుమ్మరి కొత్త కుండ తీసుకొస్తాడు. తలారి అన్ని కులాల వారిని ఆహ్వానిస్తూ బోనాల జాతరను నడిపిస్తాడు. పోతరాజు అగ్రభాగంలో నడిచి అమ్మవారికి దారి చూపిస్తాడు. వందల ఏండ్ల నుంచీ బోనాలు జరుపుకొంటున్న గుళ్ళలో కుండ, బోనం, పోతరాజు, ఘటం అలంకరించడం వంటివన్నీ ఒకే కుటుంబం నుంచి వారసత్వంగా చేపడుతున్నారు. వాస్తవానికి ఇది గ్రామ నిర్మాణంలో భాగమైన ఆయా కులాలవారికి లభించే ప్రాతినిధ్యం. కొన్ని గ్రామాలలో కొన్ని కులాలు మాత్రమే ఉంటాయి. ఆ ఊళ్ల నిర్మాణాన్ని బట్టి బోనాల జాతర నిర్వహణలో తేడాలు కనిపిస్తాయి. పోతరాజులు, పూజారులు, తొలి బోనం సమర్పణకు బాధ్యత వహించే కులాల్లో ఈ తేడాలు చూడొచ్చు. పర్యావరణాన్నే దేవతగా కొలిచే బోనాల జాతరలో ఆ ఊరి నిర్మాణంలో ఉన్న కులాలన్నీ నియమానుసారంగా భాగస్వామ్యం అవుతాయి. ఆలయాల్లో జరుపుకొనే బోనాల పండుగలోనూ ఇలాంటి నియమం కనిపిస్తుంది.
వంతుల పండుగ
బోనాల పండుగను ఒక ఆలయం తర్వాత మరో ఆలయంలో నిర్వహించడంలోనూ ఒక క్రమం కనపడుతుంది. ఆషాఢ జాతర గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయంలో మొదలవుతుంది. ఇది ఆషాఢ మాసంలో మొదటగా వచ్చే గురువారం లేదా ఆదివారంనాడు మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి ఆదివారం, గురువారం బోనాల జాతర జరుగుతుంది. ప్రతి క్షేత్రంలో ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉంటారు. గోల్కొండ బోనాలు జరిగిన రోజున గోల్కొండ ప్రాంతంలోని ఆ ఏడుగురు అక్కచెల్లెళ్లకూ బోనాలు ఇస్తారు. గోల్కొండ.. చుట్టూ ఉన్న కార్వాన్, ధూల్‌పేట, పత్తర్‌ఘట్టి, రాయదుర్గం వరకు గోల్కొండ బోనాలు జరుపుకొంటారు. గోల్కొండ మహంకాళి అమ్మవారి బోనాల కోసం ఉజ్జయిని మహంకాళి ఎదురు చూస్తుంది. గోల్కొండలో బోనాలు జరిగిన తర్వాత వచ్చే ఆదివారం రోజున లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు పండుగ చేసుకుంటారు. అదే రోజున లష్కర్‌లో ఉన్న ఏడుగురు అక్కచెల్లెళ్ల ఆలయాలన్నిటిలో బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మౌలాలి, ఈసీఐఎల్ సమీప ప్రాంతాల వరకు లష్కర్ బోనాలు జరుపుకొంటారు. తొట్టెల ఊరేగింపు, పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో లష్కర్ బోనాలు జంటనగరాల్ని ఏకం చేస్తాయి!
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం లాల్‌దర్వాజ బోనాలు ఎదురుచూస్తాయి. లాల్‌దర్వాజ బోనాలు జరుపుకొనే రోజే పాతబస్తీలోని ఏడుగురు అక్కచెల్లెళ్లకు బోనాలు సమర్పిస్తారు. శివసత్తుల పూనకాలు, కోడెనాగులాంటి కొరడా చేబూని, వీరగోలలు మోగించుకుంటూ, కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మోగిస్తూ వీరంగాలు ఆడే పోతరాజుల విన్యాసాలతో పాతబస్తీ వీధులు జనసంద్రమవుతాయి. బోనాలెత్తిన మహిళలతో వీధులన్నీ ఆలయాల వైపునకు ప్రవహిస్తున్నాయా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది
పాతబస్తీ.
నల్లకుంట ప్రాంతం భౌగోళికంగా హైదరాబాద్‌లో ఉంటుంది. లాల్‌దర్వాజ బోనాలు జరిగేటప్పుడే నల్లకుంటలో కూడా బోనాల పండుగ జరుపుకొంటారు. కానీ, ఇవి హైదరాబాద్ బోనాలు కావు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు కొనసాగింపుగా తర్వాత వారం జరుపుకొనే బోనాలు! ఇదే తరహాలో లష్కర్ బోనాలు జరిగే ప్రాంతాలకు సమీపంలో ఉన్న బోడుప్పల్‌లోని కాచివాని సింగారంలో (సింగపూర్ సిటీ దగ్గర్లో).. ఉప్పల్‌లో అయిన తర్వాతే బోనాలు జరుపుకొంటారు.
పీనుగుల మల్లన్న
సికింద్రాబాద్‌లో గురుద్వారా దగ్గర పీనుగుల మల్లన్న గుడి ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి ఓ ఐతిహ్యం ప్రచారంలో ఉంది. జంట నగరాల్లో 1868కి పూర్వం ప్లేగు వ్యాధి ప్రబలింది. వేల మంది చనిపోయారు. శవాలను ఈ మల్లన్న ఆలయం దగ్గర పడేసేవారట. శవాల దిబ్బగా ఉండటం వల్ల ఈ గుడికి ‘పీనుగుల మల్లన్న గుడి’ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి గుడి నిర్మాణం వెనకా ఓ ఐతిహ్యం ఉంది. స్థానికుడి కలలో మహంకాళి, మల్లన్న కనిపించారట. తాము ఇక్కడ వెలిశామని, గుడికట్టి, పూజలు చేస్తే కోరికలు తీరుస్తామని చెప్పారట. వారి కోరిక ప్రకారమే ఆయన గుడి కట్టించినట్లుగా ఒక గాథ ప్రచారంలో ఉంది. మరో కథనం ప్రకారం మల్లన్న ఆలయ ప్రాంగణంలో పడి ఉన్న ఒక శవాన్ని ఆవహించిన అమ్మవారు ‘నాకు మీరు బోనాలు సమర్పించడం ఆపేశారు. అందువల్లనే ఈ ఉత్పాతాలన్నీ వచ్చాయి. బోనాలు సమర్పిస్తే కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడతాన’ని పలికిందని ఒక గాథ ప్రచారంలో ఉంది. పూనకం వచ్చిన భక్తుడి ద్వారా ‘నేను మల్లన్నను. మా అక్క గుడి ఇక్కడ ఉంది’ అని ప్రకటించినట్టు కూడా చెప్పుకొంటారు. పూనకంలో చెప్పిన దిక్కుగా పోతే వేపచెట్టు, బొడ్రాయి ఉన్నాయట. అదే నేటి ఉజ్జయిని మహంకాళి దేవాలయం. గుడి ఆవరణలో ఇప్పటికీ ఆ వేపచెట్టు ఉంది. దానికి సమీపంలో బొడ్రాయిని కూడా చూడొచ్చు. ఆ వేప చెట్టుకు సాకపోసి, బొడ్రాయి దగ్గరే నేటికీ రతి పోస్తున్నారు. గ్రామ దేవతలకు మళ్లీ బోనాలు సమర్పించడంతో ఆదరణ కోల్పోయిన పండుగకు పూర్వ వైభవం వచ్చిందని హైదరాబాద్ బోనాలపై మూడు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్ పాటూరి నాగరాజ్ చెబుతున్నారు. గతంలో ఆయన చికాగో విశ్వ విద్యాలయంలో పనిచేసి వచ్చారు. 1868లో గోల్కొండ, ఉజ్జయిని, లాల్ దర్వాజ బోనాలు పునరుత్థానం పొందిన తీరును వివరించే రాతి శాసనం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ జానపద అధ్యయనాల శాఖ గుర్తించింది. అప్పటినుంచి గోల్కొండ, లష్కర్, పాతబస్తీ బోనాల వేడుకలు జరుగుతున్నాయని ప్రొఫెసర్ నాగరాజ్ అభిప్రాయపడుతున్నారు.
అలలు అలలుగా..
ఒక గుడిలో జరిగిన తర్వాతనే మరో గుడిలో బోనాల పండుగ జరుపుకోవాలనే ఆచారం వల్లే ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు బోనాలు జరుగుతాయి. నీటిలో ఒక బొట్టు పడిన చోటు నుంచి పుట్టిన అలలు వ్యాపిస్తూ వ్యాపిస్తూ పోయినట్లుగా గోల్కొండ కోటలో మొదలైన ఆషాఢ జాతరను శ్రావణం వరకు స్థానికులు దశలు దశలుగా జరుపుకొంటారు. మొక్కులు ఉన్నవారు సాధారణ రోజుల్లోనూ బోనాలు సమర్పిస్తారు. పెళ్లయితే ఆడపిల్ల పుట్టింటివాళ్లు నవ వధువుతో బోనం సమర్పిస్తారు. వ్యాపారంలో కలిసి రావడం, రోగాల నుంచి స్వస్థత లభించడం.. తదితర సందర్భాల్లోనూ బోనాలు సమర్పిస్తారు. ఏడాది పొడవునా సాగే ఈ బోనాలు ఆదివారం, మంగళవారం రోజుల్లో నివేదిస్తారు. ఇవే కాకుండా పంటను, ఇంటిని కాపుగాసే దేవతకు పొలంలో,పెరటిలో చిన్న గుడి కట్టి ఏడాదికోసారి బోనం సమర్పించే ఆనవాయితీ కూడా ఉన్నది.
గోల్కొండ బోనాలు
నిజాం నవాబుల కాలంలో.. గోల్కొండ (నేటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో)లో ప్లేగు వ్యాధికి ఎంతోమంది చనిపోయారట. స్థానికుడి కలలోకి వచ్చిన అమ్మవారు బోనాలు సమర్పించమని కోరిందని, ఆ కోరిక ప్రకారం గోల్కొండ మహంకాళికి బోనాలు సమర్పించారట. ఆ తర్వాత కాలంలో ప్లేగు వ్యాధి తగ్గడంతో ఏటా పనిబాటలోళ్లంతా కలిసి గోల్కొండ కోటలోని మహంకాళికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని స్థానికుడైన గడ్డి చంద్రశేఖర్ చెబుతున్నారు.
లష్కర్ బోనాలు
స్థానికుడైన సురిటి అప్పయ్య బ్రిటిష్ సైన్యంలో డోలీగా పనిచేస్తూ ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. అక్కడ 1813లో కలరా మహమ్మారి విజృంభించడంతో ఎంతోమంది చనిపోయారు. ఆ మహమ్మారి నుంచి కాపాడితే సికింద్రాబాద్‌లోని మహంకాళికి విగ్రహం చేయిస్తానని మొక్కుకున్నాడట అప్పయ్య. కలరా తగ్గిపోయాక క్షేమంగా నగరానికి వచ్చిన ఆయన.. జూలై 1815లో ఉజ్జయిని మహంకాళికి కొయ్య విగ్రహం చేయించాడు.
భక్తుడినే కోరిన దేవత
భక్తులు కోరిక తీర్చమని దేవతల్ని వేడుకుంటారు. కానీ, ఉజ్జయిని ఆలయం గురించి స్థానికులు చెప్పే గాథల్లో అమ్మవారు తన కోరిక తీర్చమని భక్తుడిని ఆదేశించిన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దుండిగల్‌కు సమీపంలోని జిన్నారం గ్రామంలో గాజుల వీరన్న నివసించేవాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటూనే.. గాజులు అమ్మేవాడు. ఒకరోజు పొలం దున్ని, మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద నిద్రపోతున్నాడు. అమ్మవారు కలలోకి వచ్చి తనకు విగ్రహం చేయించమని కోరిందట. పొట్టకు బట్టకే కష్టంగా ఉన్న వీరన్న అమ్మవారి కోరికను పట్టించుకోలేదు. రెండో రోజు పొలం దున్నుతుంటే ఎడ్లు తిరగబడ్డాయి. పెద్దలకు చెబితే అంజనం వేసి చూశారు. అమ్మవారి కోరిక తీర్చమని సలహా ఇచ్చారు. గాజుల మూట వేసుకుని (నేటి ఉజ్జయిని) మహంకాళి ఆలయానికి వచ్చాడట. అమ్మ వారికి ఎడమవైపు మడిగలో కూర్చుని గాజులు అమ్ముకోమని పూజారి సూచించాడట. అప్పటినుంచి ఆయన అమ్మవారిని సేవిస్తూ, అక్కడే గాజుల వ్యాపారం చేసుకునేవాడు. ఒకప్పటి చెక్క విగ్రహం స్థానంలో ప్రతిష్ఠించిన రాతి విగ్రహం గాజుల వీరన్న చేయించినదని ఆయన వారసుడు ఇమ్మడిశెట్టి ప్రతాప్ కుమార్ చెబుతున్నారు. అప్పటినుంచి సురిటి అప్పయ్య, గాజుల వీరన్న, చీకోటి రామచంద్రయ్య, కుమ్మరి రత్నయ్య, గాజుల పాపయ్య కుటుంబాలవారు ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం బావి తవ్వినప్పుడు ఇక్కడ మాణిక్యాలమ్మ విగ్రహం బయటపడింది. ఉజ్జయిని మహంకాళి ఆలయం 1953లో దేవాదాయ శాఖ నిర్వహణలోకి వచ్చింది.
bonalu | విరబోసుకున్న జుట్టు , నిప్పుకణికల్లాంటి ఎర్రని కండ్లు, బయటకు చాచిన పొడవాటి నాలుకతో.. ఉగ్రరూపంలోని మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో ‘మైసమ్మ’ అని పిలుస్తారు. ఆ తల్లికి ఎన్నో పేర్లు. ఆమె రూపాన్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు. కోటనే మహంకాళిగా భావిస్తే ఆమెను ‘కోట మైసమ్మ’. దొరల గడిని మహంకాళిగా తలిస్తే ఆమె ‘గడి మైసమ్మ’.