జిల్లాలో ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు*




 అమరుల త్యాగాలను నిరంతరం గుర్తుచేసుకునేలా హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అమరుల త్యాగం వెలకట్ట లేమని,అమరుల  త్యాగం వల్లనే తెలంగాణ సాధించుకున్నామని వారి త్యాగఫలమే తెలంగాణ అభివృద్ధికి మూలం అన్నారు. అమరులను స్మరించుకునేందుకు ఈరోజు విశేష సమావేశం జిల్లా పరిషత్, మున్సిపల్ గ్రామపంచాయతీ లలో ఏర్పాటుచేసి ప్రత్యేక తీర్మానం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అమరుల  కుటుంబాలకు  చెందిన వారిని శాలువా, మోమొంటొలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అర్.మల్లికార్జున రెడ్డి,జడ్.పి.వైస్ చైర్మన్ ఇ రిగి పెద్ధులు,
అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, 
జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
తొలుత జిల్లా పరిషత్ నుండి గడియారం సెంటర్లో గల అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా పరిషత్ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...