అమర వీరులకు నివాళులు అర్పించిన హెచ్ఎండిఏ
రెండు నిమిషాలపాటు శ్రద్ధాంజలి ఘటించిన ఉద్యోగులు
*హైదరాబాద్* : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆసువులు బాసిన అమర వీరులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఉద్యోగులు, సిబ్బంది గురువారం గనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య తెలంగాణ అస్తిత్వం కోసం, నీళ్లు, నిధులు, నియామకాలు కోసం రెండు పర్యాయాలు జరిగిన తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు, ఉద్యమం తీవ్రత, తదనంతర పరిణామాలను గురించి ఉద్యోగులకు వివరించారు.