నల్లగొండ: మృతదేహానికి వైద్యం పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మండలంలోని గంటోని గూడెం గ్రామానికి చెందిన బొబ్బలి వీరస్వామి (29) ఈనెల 19 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు ప్రమాదం పెద్ద ఎత్తున జరిగింది హైదరాబాదుకు తీసుకెళ్లమని చెప్పారు. దీంతో బంధువులు ఆ రాత్రి వెళ్లలేక జిల్లా కేంద్రంలోని ఐకాన్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.
అయితే ఆ సందర్భంలో వైద్యులు 99 శాతం గాయాలు నయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యం పేరుతో ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈరోజు ఉదయం కూడా పేషంట్‌కి ప్లేట్లెట్లు తగ్గాయని, వాటిని తీసుకురావాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు.
అదే వైద్యులు ప్లేట్ లెట్స్ ఎక్కించిన బతికే పరిస్థితి లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆవేదంలోనయ్యారు. అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే ప్రమాదం జరిగిన రోజే మరణించినట్లు తెలుస్తోంది. మృతదేహం బాగా ఉబ్బినట్లు కనిపిస్తుంది. అయితే చనిపోయిన శవానికి వైద్యం పేరుతో లక్షల గుంజడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఏ మాత్రం మానవత్వం లేని ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా రైతుల శవాలతో వ్యాపారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్ పై తీసుకోవాల్సిన వైద్యాధికారులు నిమ్మకుండిపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్స్ రాజ్యమేలుతున్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.