అమరుల త్యాగం అజరామరం--మంత్రి జగదీష్ రెడ్డి

 అమరుల త్యాగం అజరామరం

#రాష్ట్ర సాధనలో వారి పాత్ర చిరస్మరణీయం

#కేంద్రంకుట్రలు,విపక్షాల విష రాజకీయాలే వారి ఆత్మబలిదానాలు

#అమర వీరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ దండలు

#త్యాగాల పునాదుల మీదనే రాష్ట్ర సాధన

#రాష్ట్ర సాధనలో పదవిని త్వజించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటి నుండే శంఖారావం

#రాష్ట్ర సాధన ఉద్యమంపై సీమాంధ్ర పాలకుల విష ప్రచారం

#ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత దాడి

#తెలంగాణా కు వ్యతిరేకంగా ఒక్కటైన చంద్రబాబు, వై యస్ ఆర్ లు

#ప్రకటన వెలువడాకా బహిర్గతం ఆయిన సీమాంధ్రుల కుట్రలు

#రాష్ట్ర సాధన ఉద్యమంలో చిచ్చుపెట్టిన ఘనులు

#గులాబీ పార్టీని చీల్చే కుయుక్తులు

#అందరిఅనుమానాలను పటాపంచలు చేసిన నేత

#అమరులఆకాంక్షలకు అనుగుణంగా పాలన

#ఆకలి దరిద్రాన్ని పారద్రోలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది

#సమృద్ధిగా సాగు నీరు,ఇంటింటికి త్రాగునీరు

#పంటలు సస్యశ్యామలం

#తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షం

#అన్ని రంగాలలో అభివృద్ధితో దేశానికే ఆదర్శం

#దశాబ్దిఉత్సవాలలో అధికారుల పాత్ర శ్లాఘనీయం

#ఈ ఉత్సవాలు ప్రపంచ చరిత్రలోనే అరుదైన సందర్భం

#ప్రజలు,ప్రజాప్రతినిధులు,అధికారులు,ప్రభుత్వం కలిసి చేసుకున్న అపురూపమైన ఉత్సవాలు

 👉🏿అమరుల త్యాగం అజరామరం

 👉🏿మంత్రి జగదీష్ రెడ్డి

===============

#సూర్యపేటలో ఘనంగా అమరవీరుల దినోత్సవం

#భారీ ర్యాలీ,అమరవీరుల కుటుంబాలకు సత్కారం, సహపంక్తి భోజనాలు

#ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,పాల్గొన్న జడ్ పి చైర్మన్ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్ పి రాజేంద్రప్రసాద్ తదితరులు

===============

రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్ది కొనియాడారు. తెలంగాణా రాష్ట్ర చరిత్రలో వారి పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. వారి స్ఫూర్తి వర్తమానానికి అందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రతి ఏటా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.రాష్ట్రవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలలో బాగంగా చివరి రోజు అయిన అమరవీరుల దినోత్సవాన్ని సూర్యపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరులను స్మరిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్ వి ఇంజినీరింగ్ కళాశాల నుండి మొదలైన ర్యాలీ మెడికల్ కలశాల,కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా,పూల సెంటర్, పి ఎస్ ఆర్ సెంటర్ మీదుగా చర్చి కాంపౌండ్, ఖమ్మం రోడ్,అమ్మా గార్డెన్స్ ఎదురుగా 100 ఫీట్ల రోడ్ నుండి కుడకుడా రోడ్, కొత్త బస్ స్టాండ్, తెలంగాణ తల్లి విగ్రహం, యం జి రోడ్, శంకర్ విలాస్ సెంటర్, రైతుబజార్ మీదుగా సద్దుల చెరువు (మినీ ట్యాన్క్ బండ్)వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీ చేరుకుంది.అనంతరం అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మీదట అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన దశాబ్దిఉత్సవాల ముగింపు వేడుకలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కొరకు జరుగుతున్న ఉద్యమ సమయంలో కేంద్రం పన్నిన కుట్రలకు,విపక్షాలు చిందిన విషపు రాజకీయాలకు వారు ఆత్మలను బలిదానమిచ్చారని ఆయన తెలిపారు. వైరి వర్గాలు అనుకున్న చంద్రబాబు, వై ఎస్ ఆర్ లు తెలంగాణా అంశంలో ఒక్కటై చేసిన కుయుక్తులు కుడా వారి బలిదానాలకు కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రకటన వెలువడిన మీదట వైరి వర్గాలు ఒక్కటై తెలంగాణాకు వ్యతిరేకంగా సీమాంధ్రులు ఏకం కావడం కుడా వారి బలిదానాలకు కారణాలలో ఒక్కటి అని ఆయన చెప్పారు. అటువంటి అమరవీరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ దండలు ఎప్పుడూ ఉంటాయన్నారు.అమరవీరులను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల దినోత్సవం ఏర్పాటు చేసిందన్నారు.త్యాగాల పునాదుల మీదనే రాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు.రాష్ట్ర సాధనలో మంత్రి పదవిని త్వజించిన దివంగత నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక నివాస గృహం జలదృశ్యం నుండే 2001 లో రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చుట్టారన్నారు.అటువంటి ఉద్యమం పై నీలి నీడలు కమ్ముకునేలా నాటి సీమాంద్ర పాలకులు వారికి వత్తాసు పలుకుతున్న తెలంగాణా ప్రాంత నాయకులు అపోహలు, అనుమానాలు సృష్టించారన్నారు.దానికి తోడు మీడియా హౌజ్ లు విషపు రాతలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నారన్నారు.

రాష్ట్ర సాధనలో ఉద్యమ పార్టీని చీల్చి తెలంగాణ ఉద్యమాన్ని నిరుగార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఆయన వివరించారు.

వాటన్నింటిని అధిగమించి ఉద్యమం తొలి ప్రస్థానంలో ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అన్న మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని సాధించారని ఆయన కొనియాడారు.రక్తం చింద కుండా,హింస ప్రజ్వరిల్ల కుండా రాష్ట్రాన్ని సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బయలు దేరితే విపక్షాల కుట్రలు,కుతంత్రాలు, కుయుక్తులకు తల్లడిల్లిన యువత ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో కుమిలి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాను స్వయంగా బలిపీఠమెక్కి రాష్ట్రాన్ని సాధించారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అటువంటి తరుణంలో సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లగా సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు.అమర వీరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాదించిందన్నారు.బీళ్లుగా మారిన పంటపొలాలకు సమృద్ధిగా సాగునీరు,  ఇంటింటికి మంచినీరు,24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాలో తెలంగాణా రాష్ట్రంతో మరెవరూ పోటీ పడలేని విదంగా మార్పు తీసుకొచ్చామన్నారు. సంక్షేమ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేసీఆరే దీటు అనేలా పధకాలు రూపు దిద్దుకుని అమలౌతున్నాయన్నారు.కాకి లెక్కలు,కానీ పనులతో ప్రజలను గడబిడ చెయ్యకుండా

 ఎక్కడ అభివృద్ధి జరిగిందో అక్కడి నుండే దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టమన్నారు.ఆధునిక డేవాలయలుగా విరాజిల్లుతున్న రైతు వేదికల మీదనే రైతు పండుగ,త్రాగు నీరిచ్చిన ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్దనే నీళ్ల పండుగ శాంతిసామ రస్యాలు ఫరీడవిల్లుతున్న చోట సురక్షా దినోత్సవ వేడుకలు, పల్లెల్లో పల్లె ప్రగతి,పట్టణాల్లో పట్టణ ప్రగతి దినోత్సవం జరుపుకున్నామన్నారు.ఒక్క మాటలో చెప్పాలి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన రాష్ట్రవతరణ వేడుకలు ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు.ప్రజలు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం భాగస్వామ్యంతో జరుపుకున్న దశాబ్దిఉత్సవాలు చరిత్రలోనే అపురూపమైన ఘట్టంగా మిగిలిపోతయాన్నారు.ఇటువంటి అరుదైన ఘట్టంలో అధికారుల పాత్ర శ్లాఘనీయమన్నారు. విధానాలు రూపొందించడం వరకే పాలకుల పాత్ర ఉంటుందని అమలు పర్చాల్సిన పాత్ర అధికారులదే నన్నారు.అటువంటి విధానాలు అమలు పరచడంలో ప్రభుత్వ ఉద్యోగులు రేయింబవళ్లు శ్రమించినందునే 21 రోజుల పాటు నిరంతరంగా సాగిన రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగాయని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు.జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షత వహించిన

 ఈ కార్యక్రమంలోజిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,గ్రంధాలయ సంస్ధ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్ పి వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...