సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్ వేస్తారు. కానీ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పద మృతిపై విచారణ కమిషన్ వేయాలన్న డిమాండ్‌ను నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారు. అయినా ముఖర్జీ త్యాగం వృథా పోలేదు. ఆయన నాయకత్వంలో ఆవిర్భవించిన బిజెపి ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోంది. స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ. ఆయన గొప్ప విద్యావేత్త కూడా. 33 ఏళ్లకే అసాధారణ స్థాయిలో రెండు పర్యాయాలు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్సలర్ అయిన మేధావి. తదనంతర కాలంలో మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో శక్తిమంతమైన మతతత్వ పార్టీగా ముస్లిం లీగ్ అవతరిస్తున్న సందర్భంలో ఆయన సావర్కర్ ప్రభావంతో హిందూ మహాసభలో చేరి రాజ కీయాల్లో అడుగుపెట్టారు. డాక్టర్ ముఖర్జీ సామర్థ్యం పట్ల అపార విశ్వాసం ఉన్న గాంధీజీ ఒత్తిడితోనే ప్రధాని నెహ్రూ స్వతంత్ర హోదాతో మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక, మైనారిటీ సంతుష్టీకరణ విధానాలవల్ల భవిష్యత్తులో దేశంలో ఎదురుకానున్న పరిస్థితులను అంచనా వేసిన డాక్టర్ ముఖర్జీ, నెహ్రూ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆల్ ఇండియా హిందూ మహాసభ కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేశమంతా విస్తృతంగా పర్యటించారు. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ గురూజీ గోల్వల్కర్‌ను కలిసి పార్టీ స్థాపించాలన్న తన మనోగతాన్ని వెల్లడించారు. ముఖర్జీకి ఆర్‌ఎస్‌ఎస్ నుండి పూర్తి సహకారం ఉంటుందని గురూజీ గోల్వాల్కర్ అభయమిచ్చారు. గురూజీ గోల్వాల్కర్ డాక్టర్ ముఖర్జీ స్థాపించబోయే పార్టీకి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి లాంటి నాయకులను జతచేశారు. 1951 అక్టోబర్ 21వ తేదీన ఢిల్లీలో భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావం తొలినాళ్లలోనే భారతీయ జనసంఘ్ 1951–52 ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాలను సాధించింది. అదే సమయంలో కశ్మీర్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతూ వస్తోంది. ప్రతిప
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...